సాధారణంగా ఎలాంటి వైరల్ జ్వరానికైనా వారం రోజుల్లో ఎలాంటి చికిత్స లేకుండా దానికదే తగ్గిపోయే గుణం ఉంటుంది. కరోనా కాలంలో జ్వరం వస్తే వస్తే చాలు అది మహమ్మారి జ్వరమేనేమో అని ప్రజలు హడలిపోతున్నారు. అయితే వైరల్ జ్వరాలకు, ఇతర జ్వరాలకూ ఉండే తేడా తెలుసుకోవడం వల్ల ఆందోళనలూ, అజాగ్రత్తలు తగ్గుతాయి. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.6 డిగ్రీల ఫారెన్ హీట్గా ఉంటుంది. దీనికంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ‘జ్వరం’ వచ్చిందనవచ్చు.
చాలా మందిలో వ్యాయామం చేసినప్పుడు, గర్భిణీ స్త్రీలలో, రుతుక్రమం సమయంలో శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. జ్వరం అనేది శరీరంలో జరుగుతున్న మార్పులకు ఒక హెచ్చరికే కాదు. శరీరంలో చేరిన సూక్ష్మజీవులను నశింపజేసే ఒక రక్షణ ప్రక్రియ కూడా. అయితే ఎంత తీవ్రమైన జ్వరం అయినా అరగంటలో తగ్గించే చిట్కా ఆయుర్వేదంలో ఉంది. దీనినే పెసరకట్టు వైద్యం అంటారు. పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన సమృద్ధమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి. వీటి వలన మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.
జ్వరంతో బాధపడుతున్న వారు ఆ తీవ్రతను బట్టి .. ఎక్కువ జ్వరం ఉన్నవారు.. 20 నిమిషాలు.. తక్కువ జ్వరం ఉన్నవారు.. 15 నిమిషాలు పెసర పప్పును ఓ కప్పు నీటిలో నానబెట్టి.. ఆ నీటిని తాగాలి. ఇది జ్వరం ఉన్న వారికి రుచించకపోయినా తాగాలి. ఈ నీటిని తాగిన కొద్ది నిమిషాల్లోనే ఒంట్లో ఉన్న జ్వరం తాలూకా వేడి తగ్గిపోయి శరీరం చల్లబడుతుంది. అప్పుడు ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఆ సమయంలో త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటే అది శరీరానికి అవసరమైన శక్తిని ఇచ్చి ఎనర్జీ లెవల్స్ తిరిగి వస్తాయి. పెసరు పప్పులో ఉండే అద్భుతమైన గుణాలు మాంగనీస్, ప్రోటీన్స్, విటమిన్ సి,విటమిన్ బి లు శరీరానికి తొందరగా చల్లదనాన్ని ఇవ్వడంలో ఉపయోగపడుతాయి.