మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తుండగా మరోసారి మహర్షి టీజర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అయితే ఈ సారి ఈ టీజర్ లో మహేష్ బాబుకి బదులుగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కనిపించి అలరిస్తున్నారు. ‘
‘
2020 లాక్ డౌన్ లో వరుస వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకున్న వార్నర్ ఈ ఏడాది మరో కిక్కిచ్చే వీడియోతో 2020 సంవత్సరానికి ముగింపు పలికాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ మహర్షి సినిమా టీజర్ ను ఎడిట్ చేసి అందులో మహేష్ బాబు మొహానికి తన మొహాన్ని మ్యాచ్ చేసాడు. పాటలు, ఫైట్లు, డ్యాన్సులతో అలరించాడు. ఇక మహేష్ బాబు డైలాగులతో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.